Jairam Ramesh: తెలంగాణ ఏర్పాటు, ఉచిత్ కరెంటు గురించి పెద్ద ప్రకటనే చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు

Jairam Ramesh: తెలంగాణ ఏర్పాటు, ఉచిత్ కరెంటు గురించి పెద్ద ప్రకటనే చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు రూపొందించడం నుంచి పార్లమెంటులో పెట్టించి పాస్ చేయించింది సోనియా గాంధీనేనని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా మునుగోడులో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు మాత్రమే బాగు పడ్డారని, ఫాంహౌస్‌లో కూర్చుని నిజాం పాలన కొనసాగిస్తున్నారని జైరా రమేశ్ మండిపడ్డారు.

ఇక తెలంగాణలో కరెంటు అంశం గురించి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే తాము 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ వాదిస్తుండగా.. అసలు ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీయని జైరాం రమేశ్ అన్నారు. 4 వేల కిలోమీటర్లు రాహుల్ గాంధీ పర్యటన చేశారని, భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలలో చైతన్యం వచ్చిందని అన్నారు. 30వ తేదీ కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని జైరాం ధీమా వ్యక్తం చేశారు.

ఆరు గ్యారెంటీ పథకాలు వ్యక్తులవి కావని, అవి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆరు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి శాసిస్తున్న కేసీఆర్ ఉద్యోగ నోటిఫికెషన్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టాటా బై బై కేసీఆర్ అంటారని, పాత మోడల్ అంబాసిడర్ కార్ గ్యారేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.