బీఆర్ఎస్‌లో చివరికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ దళంలో వలసల గుబులు

38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..

బీఆర్ఎస్‌లో చివరికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ దళంలో వలసల గుబులు

Congress Operation Akarsh : తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రోజురోజుకి వలసలు పెరిగిపోతున్నాయి. కారు దిగేస్తున్న ఎమ్మెల్యేలకు అభయ హస్తం అందిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో రోజుకో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా, ఇంకా వారి దారిలో ఎవరెవరు నడవబోతున్నారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గులాబీ దళంలోనూ ఎమ్మెల్యేల పట్ల అనుమానపు చూపులు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కారు దిగేసి కాంగ్రెస్ గూటికి చేరిపోతారో అన్న ఒక సందేహం బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది.

కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు. తాము పార్టీ మారబోమని, చివరి వరకు మీతోనే ఉంటామని చెప్పి వచ్చారు. అయితే, గతంలోనూ ఇలాంటి మాటలే మాట్లాడారు పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు. కేసీఆర్ కు ఇప్పుడు అండగా ఉండాలి, కేసీఆర్ ను కాపాడుకోవాలంటూ పోచారం మాట్లాడారు. అలా మాట్లాడిన కొన్ని రోజులకే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.

ఇంకా ఎవరెవరు పార్టీ మారబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది గెలిస్తే అందులో కంటోన్మెంట్ కు బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. మిగిలిన 38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన 33 మందిలో కచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆ పార్టీలోనే ఉంటారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ”చివరకు మిగిలేదెవరు?” స్పెషల్ అనాలసిస్..

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?