Telangana Congress : కాంగ్రెస్ గెలిచినా.. ఓటమి పాలైన సీనియర్లు

కాంగ్రెస్ గెలిచినా.. కొందరు నాయకుల్లో ఆ సంతోషం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఓటమి పాలయ్యారు.

Telangana Congress : కాంగ్రెస్ గెలిచినా.. ఓటమి పాలైన సీనియర్లు

Telangana Congress Senior Leaders Defeat (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ప్రజలు అధికార బీఆర్ఎస్ ను తిరస్కరించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సంపూర్ణ గెలుపు నమోదు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ను(60) క్రాస్ చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్.. అధికారం దక్కించుకోవడానికి పదేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు పవర్ లోకి వచ్చింది. ఈ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కేడర్ లో నూతనోత్సాహం నింపింది.

కాంగ్రెస్ గెలిచినా.. కొందరు నాయకుల్లో ఆ సంతోషం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఓటమి పాలయ్యారు. తమ ప్రత్యర్థుల చేతిలో వారు ఓడిపోయారు. కాంగ్రెస్ సీనియర్లు జీవన్ రెడ్డి(జగిత్యాల), జగ్గారెడ్డి(సంగారెడ్డి), మధుయాష్కీ(ఎల్బీ నగర్), షబ్బీర్ అలీ(నిజామాబాద్ అర్బన్) ఓటమి చవిచూశారు. అనూహ్యంగా కాంగ్రెస్ లోని పెద్ద లీడర్లు ఓటమిపాలైతే.. కొంతమంది అభ్యర్ధులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

అటు బీజేపీలోనూ ముఖ్య నాయకులు ఓడిపోయారు. ఈటల రాజేందర్(హుజూరాబాద్, గజ్వేల్), బండి సంజయ్(కరీంనగర్), ధర్మపురి అరవింద్(కోరుట్ల), రఘునందన్ రావు(దుబ్బాక) ఓటమిని చవిచూశారు. ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయమే ఎదురైంది.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?