MP Manne Srinivas Reddy : ఎంపీగారూ మూడేళ్లైనా ఒక్కసారీ మా సమస్యలపై మాట్లాడరేంటండీ..మీలాంటోళ్లు మాకెందుకండీ..?
ఎంపీగారూ ఓట్ల కోసం వచ్చారు. గెలిచారు. మూడేళ్లైనా ఒక్కసారీ మా సమస్యలపై మాట్లాడరేంటండీ..మీలాంటోళ్లు మాకెందుకండీ..? అంటు పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిపై మండిపడుతున్నారు ప్రజలు

Palamuru Mp Manne Srinivas Reddy
MBNR Palamuru MP Manne Srinivas Reddy : అదృష్టం కలిసొచ్చింది.. అధికార పార్టీ నుంచి ఎంపీ టికెట్ వచ్చింది. జనం నుంచి మద్దతు వచ్చింది. అదే.. ఊపులో తొలిసారి ఎంపీగా పోటీ చేసినా.. గెలుపు వరించింది. ఎంపీగా.. మూడేళ్ల అనుభవం వచ్చినా.. ఆయన మాత్రం తన లోక్‌సభ పరిధిలోని ప్రజలకు చిక్కరు.. దొరకరు.. అని అదే పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు. ఆయనే.. పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి. మూడేళ్లలో.. ఒక్కనాడు కూడా మహబూబ్‌నగర్ సమస్యలపై గళం విప్పింది లేదు. జనానికి దగ్గరైంది లేదు.
రాజకీయాన్ని నమ్ముకొని.. నిత్యం ప్రజలతో మమేకమయ్యే నాయకులకు.. ఎప్పుడెలాంటి పదవులొస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. కొందరు నాయకులకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా.. వారికి చాలా ఆలస్యంగా పదవులు దక్కుతుంటాయ్. కొందరికి మాత్రం.. వద్దని మొహం మీదే తలుపులేసినా.. అదృష్టం తన్నుకొచ్చేస్తుంటుంది. మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా అలాంటి బ్యాచే. ఎంపీ ఎన్నికల టైంలో.. పాలమూరు టీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఆయన పేరు అనూహ్యంగా తెరమీదికొచ్చింది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని.. మన్నె శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దించింది గులాబీ అధిష్టానం. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబసభ్యుడిగా.. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా.. శ్రీనివాస్ రెడ్డికి పోటీ చేసే చాన్స్ ఇచ్చింది అధికార పార్టీ. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండటం కూడా.. ఆయనకు బాగా కలిసొచ్చింది.
Also read : Telangana : ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరితే..మా పరిస్థితి ఏంటీ అంటూ టీ.కాంగ్రెస్ నేతల డైలమా..ఎందుకంటే..?
పాలమూరు ఎంపీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి.. పర్యటించేది అంతంతమాత్రమేననే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అధికారిక కార్యక్రమాలకు, పార్టీ ప్రోగ్రాంలకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. టీఆర్ఎస్ కార్యకర్తలు తెగ ఫీలైపోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కూడా పెద్దగా అందుబాటులో ఉండరన్న టాక్ ఉంది. ఎంపీ శ్రీనివాస్ రెడ్డి.. ఏ కార్యక్రమానికి హాజరవ్వాలనేది కూడా ఓ మంత్రి నిర్ణయించాల్సి ఉంటుందని.. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే.. ఎంపీ నియోజకవర్గాల్లో కనిపిస్తారని.. పాలమూరు టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
వ్యాపారం నిమిత్తం.. హైదరాబాద్‌లో ఉంటూ.. అప్పుడప్పుడు సొంతూరికి వచ్చి వెళ్లడం మినహా.. ఎంపీ హోదాలో ఇతర కార్యక్రమాల్లో ఆయన కనిపించడం అంతంత మాత్రమేనని.. జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ లాంటి నేతల జిల్లా పర్యటనల్లో మినహా.. మిగతా సందర్భాల్లో ఎంపీ కనిపించడం కష్టమేనని.. పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో..
పార్లమెంట్ వేదికగా.. పాలమూరు సమస్యలపై ఒక్క రోజు కూడా గళమెత్తిన దాఖలాలు లేవంటున్నారు. అయితే.. ఇందుకు మరో కారణం కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఎంపీ సోదరుడి తనయుడు మన్నె జీవన్ రెడ్డి.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారనే.. ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు శ్రీనివాస్ రెడ్డికి బ్రేకులు వేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. జడ్చర్ల గానీ, మహబూబ్‌నగర్ నుంచి గానీ.. పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని.. జీవన్ రెడ్డి గులాబీ పార్టీ పెద్దల ముందు తన ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది.
Also read : Bandi sanjay : గద్వాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర.. సాయంత్రం భారీ బహిరంగ సభ
ఇప్పటికే.. మన్నె జీవన్ రెడ్డికి.. పార్టీలో ఉన్న సన్నిహిత సంబంధాలతో.. టీటీడీ బోర్డు మెంబర్‌గా చాన్స్ దక్కింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు.. అభ్యర్థుల రేసులో ఆయన పేరు కూడా వినిపించింది. జడ్చర్ల కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న జీవన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుండటం కూడా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎంపీపై అసంతృప్తికి కారణమన్న ప్రచారం సాగుతోంది.