పెరుగు కోసం ఫ్రిడ్జ్ తిరిచింది.. అంతలో..
జిల్లాలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ పేలి ఓ యువతి మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ ను తెరిచేక్రమంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ప్రమాదం చోటుచేసుకుంది.
జిల్లాలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ పేలి ఓ యువతి మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ ను తెరిచేక్రమంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. ఫ్రిడ్జ్ పేలి ఓ యువతి మృతి చెందింది. ఇంట్లో ఫ్రిడ్జ్ ను తెరిచేక్రమంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బొంగులూరులో మనోహర్, వనిత దంపతులు తన ఇద్దరు కూతుళ్లు దీపిక, ప్రవళికతో నివాసముంటున్నారు. పెద్ద కూతురు దీపిక (17) విశ్వహిందు కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చుదువుతోంది. ఎగ్జామ్స్ కోసం ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతుంది. తల్లిదండ్రులు చిన్న కూతురు ప్రవళికను తీసుకుని ఫంక్షన్ కు వెళ్లారు.
పెరుగు కోసం దీపిక ఫ్రిడ్జ్ ను తెరిచే క్రమంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో తీవ్ర గాయాలైన దీపిక మృతి చెందింది. పేలుడు ధాటికి ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో దీపికి పడి ఉన్నట్లు చుట్టు పక్కల వారు తెలిపారు. అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ పేలిందా ? మరేదైనా కారణంతో పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.