Telangana : తెలంగాణలో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు.

Telangana : తెలంగాణలో కొత్తగా 173 కరోనా పాజిటివ్ కేసులు

Corona (5)

Updated On : September 19, 2021 / 9:23 PM IST

Telangana : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చింది. కొన్ని జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావడం లేదు. ఇక గడిచిన 24 గంటల్లో 35,160 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 173 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,94,564కి చేరింది.

Read More : IPL 2021 CSK vs MI : నిప్పులు చెరిగిన ముంబై బౌలర్లు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,904కి చేరింది. కరోనాబారి నుంచి గడిచిన 24 గంటల్లో 315 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రజల్లో అవగాహనతోపాటు టీకా కొరత తీరడంతో టీకా వితరణ రికార్డు స్థాయిలో జరుగుతోంది.