Telangana Coronavirus..ఎక్కడ ఎన్ని కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి.
2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46 వేల 274కి చేరాయి. మరణాల సంఖ్య 422కి చేరింది.
తాజాగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 510 కేసులు నమోదు కాగా…రంగారెడ్డిలో 106 కేసులు, మేడ్చల్ లో 76 కేసులు రికార్డయ్యాయి. 11 వేల 003 కరోనా పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 74 శాతం ఉంది. మరణాల రేటు 0.91 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11 వేల 530 ఉండగా, 34 వేల 323 మంది కోలుకున్నారు.
ఎక్కడెక్కడ ఎన్ని కేసులు అంటే…
జీహెచ్ఎంసీ. 510. రంగారెడ్డి 106. మేడ్చల్ 76. సంగారెడ్డి 10. ఖమ్మం 03. వరంగల్ అర్బన్ 73. వరంగల్ రూరల్ 1. నిర్మల్ 01. కరీంనగర్ 87. మహబూబ్‌నగర్ 50. జగిత్యాల 36. మహబూబాబాద్‌లో 36. నిజామాబాద్ 31, నాగర్‌కర్నూల్ 27.
భూపాలపల్లి 26. నల్లగొండలో 24. మెదక్ 13. జనగామ 12. సూర్యాపేటలో 12. కొత్తగూడెం 11. ఆదిలాబాద్ 11. వికారాబాద్‌లో 11. సంగారెడ్డి 10, ములుగు 9. పెద్దపల్లి 8. ఆసిఫాబాద్ 4. ఖమ్మం 3. సిద్దిపేట 03. గద్వాల 03. , మంచిర్యాల 03. వరంగల్ రూరల్ 01. నిర్మల్ 01. యాదాద్రి భువనగిరి 01. జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.