ముంబై నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా…నిజామాబాద్ జిల్లాలో నాలుగు కేసులు

నిజామాబాద్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముంబై నుంచి వచ్చిన ఇందల్ వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని దీంతో అతని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
అతనితో కలిసి ప్రయాణం చేసిన ఎనిమిది మందిని హోం క్వారంటైన్ చేశామని
మంత్రి తెలిపారు. అంతేకాకుండా మరో నలుగురి జిల్లా వాసులను ఎయిర్ పోర్టులో పరీక్షించగా వారికి పాజిటివ్ రావడంతో వారిని కూడా గాంధీ హాస్పిటల్ కు పంపించామని తెలిపారు.
ఇందల్ వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగా కిషన్ అనే వ్యక్తి ముంబై నుంచి వచ్చారని మంత్రి చెప్పారు. వారిని టెస్టు చేయగా లక్షణాలు ఉండటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి పంపించామని తెలిపారు. వారితోపాటు ట్రావెల్ చేసిన 8 మందిని హోంక్వారంటైన్ లో ఉంచామని, వారిక ఏమీ ఇబ్బంది లేదన్నారు.