మంచిర్యాలలో కరోనా కలకలం, ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి జలుబు, దగ్గు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడి రక్త నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు వస్తే కానీ ఏ విషయం తెలియదు.
కరోనా నుంచి కోలుకున్న హైదరాబాదీ:
కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో మంచిర్యాలలో కలకలం రేగింది. నస్పూర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా, బాధితుడు ఎవరెవరిని కలిశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. తెలంగాణలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదవగా, ఆ వ్యక్తి పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో అతడికి చికిత్స అందించారు. చికిత్స తర్వాత రిపోర్టులో కరోనా నెగిటివ్ రావడంతో ఆ వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే ఇటలీ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది.
See Also | ప్రేమించి మోసగించాడని ఎన్నికల్లో పోటీకి దిగిన యువతి
భారత్ లో 83కి పెరిగిన కరోనా కేసులు:
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన భారత దేశంలోనూ కరోనా కమ్మేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం(మార్చి 14,2020) నాటికి 83కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ వృద్ధురాలు మరణించారు.
విద్యా సంస్థలు, మాల్స్, థియేటర్లు బంద్:
క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేశారు.
ప్రపంచవ్యాప్తంగా 5వేల 438మంది కరోనా మృతులు:
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్, చైనాని నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. చైనాలో కరోనా మరణాలు ఆగడం లేదు. అటు యూరప్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5వేల 438మంది కరోనాతో చనిపోయారు.