గాంధీ ఆస్పత్రిలో వైరస్ క్లీన్ చేసే రోబో

ఆస్పత్రుల్లో వైరస్ నిర్మూలన కోసం రీవాక్స్ ఫార్మా సంస్థ తయారు చేసిన రోబోను(యూవీ రోవా బీఆర్ అనే మొబైల్ ర్యాపిడ్ వైరస్ డిస్‌ఇన్‌ఫెక్షన్ రోబో) మంత్రి కేటీఆర్ గాంధీ ఆస్పత్రికి అందచేశారు. శనివారం ప్రగతిభవన్‌లో రూ.12 లక్షల విలువైన రోబోను సామాజిక బాధ్యత కింద ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ద్వారా గాంధీ దవాఖానకు ఉచితంగా అందించారు.
ఈ రోబోతో మానవుల ప్రమేయం లేకుండా ఆస్పత్రిలోని కొవిడ్ గదులను, ఇతర ప్రాంతాలను శుభ్రం చేసుకోవచ్చు. చిన్న బటన్ నొక్కడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఏ గదిలో అవసరమో అక్కడపెట్టి బటన్ నొక్కిన ఐదు నిమిషాల్లో వైరస్ రహితం చేస్తుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు.