ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ.. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనా..కరోనా..ఈ కనిపించని పురుగు..అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులేనని వైద్య వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరూ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తాజాగా పార్సిగుట్టలో కొంతమంది మత ప్రచారకులు వచ్చారని, వీరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే వార్త హల్ చల్ చేసింది.
ఢిల్లీలో ఇటీవలే ఓ మత ప్రచారానికి వెళ్లి తెలంగాణకు వచ్చారు. వీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. తాజాగా 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం సికింద్రాబాద్ లో పార్సిగుట్టలో ఓ మతానికి చెందిన వారు ఉన్నారని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. అక్కడకు చేరుకొనే సరికి ఐదుగురు వ్యక్తులు పరార్ అయ్యారు.
ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్సిగుట్టలో ఎక్కడెక్కడ తిరిగారోనని స్థానికులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారైన ఐదుగురు ఎక్కడున్నారో తెలియడం లేదు.
* తెలంగాణాలో పాజిటివ్ కేసులు 127కి చేరాయి
* 9 మంది చనిపోయారు.
* ఢిల్లీలో మతపరమైన సదస్సుకు రాష్ట్రం నుంచి 2200 మంది వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించింది.
* వీరిలో ఇప్పటివరకూ 35 మందిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
* మిగిలినవారిలో ఎందరిలో కరోనా లక్షణాలున్నాయి.
* వీరు ఎంతమందిని కలిశారనేది ప్రాధాన్యాంశాలుగా మారాయి.
* కరోనా సోకిన వారిలో నాగర్‌కర్నూలులో ఓ బట్టల వ్యాపారి, ఓ మటన్ వ్యాపారి ఉన్నారు.
* వీరు వందల మందిని కలిసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
* ఇప్పటివరకూ తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న కేసులు 400 వరకూ నమోదయ్యాయి.
* హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో 120 కేసులొచ్చినట్లు గుర్తించారు.
* అప్రమత్తమైన ఆరోగ్యశాఖ.. ఆయా రోగుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.
* నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలో కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది.
* ఆ బాలికకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు 20 మందిని అధికారులు అబ్జర్వేషన్‌లో ఉంచారు.
Also Read | ఆదుకోండి ప్లీజ్.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్