గాంధీ ఆస్పత్రిలో కరోనా టెన్షన్.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పాజిటివ్
హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీలో కరోనా టెన్షన్ నెలకొంది. మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా మెడి

Gandhi Hospital
హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీలో కరోనా టెన్షన్ నెలకొంది. మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా మెడికల్ కాలేజీ సిబ్బందిలో కలవరం మొదలైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి మెడికల్ కాలేజీలో చాలామందిని కలిశాడు. అతడికి ఎప్పుడు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా సోకడం పట్ల మెడికల్ కాలేజీ సిబ్బందిలో భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వచ్చిన ఆపరేటర్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలను కూడా కలిశాడు.
కరోనా సోకిన బాధితుడు ఇప్పటివరకూ డిపార్టమెంట్లో ఎంతమందిని కలిశాడు? బయట ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా బాధితుడు పనిచేసే డిపార్ట్ మెంట్లో పనిచేసే మిగతా అందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.