Jana Garjana Sabha: జనగర్జనకు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకోవడం లేదు.. తప్పుడు ప్రచారం చేయొద్దు: సీపీ

ఇప్పటికే వందలాది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Jana Garjana Sabha: జనగర్జనకు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకోవడం లేదు.. తప్పుడు ప్రచారం చేయొద్దు: సీపీ

CP Vishnu Warrier

Updated On : July 2, 2023 / 3:57 PM IST

Jana Garjana Sabha – CP Vishnu: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న జనగర్జన బహిరంగ సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో దీనిపై సీపీ విష్ణు స్పందించారు. జనగర్జనకు వెళ్తున్న వాహనాలను తామేం అడ్డుకోవడం లేదని, తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ డైవెర్షన్ మినహా తాము ఎక్కడా చెక్ పోస్టులు కూడా పెట్టలేదని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు.

కాగా, ఇప్పటికే వందలాది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ అంశంపై డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు. దీంతో అటువంటి ఘటనలు జరగకుండా చూసుకుటామని డీజీపీ చెప్పారు. భద్రాచలంలో ఖమ్మం సభ కోసం సిద్ధంగా ఉన్న ఆటోలను కామేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

”తెలంగాణ జన గర్జన” సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ కు, వారి పోలీస్ వ్యవస్థకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత కిరణ్ చామల అన్నారు. ప్రజలను ఖమ్మం సభకు అనుమతించక పోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పారు.

MLA Duddilla Sridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనగర్జన బహిరంగ సభ ఆగదు