CM KCR : ఎన్నికల వేళ కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త టెన్షన్.. ఎమ్మెల్యేలకు శాపంగా మారిన ఆ పథకం?

డిమాండ్ కు తగ్గట్టుగా ఇవ్వలేక, ఇచ్చిన వాటిలోనూ అవినీతి కారణంగా సర్కార్ పై వ్యతిరేకత వస్తోంది. CM KCR Government

CM KCR : ఎన్నికల వేళ కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త టెన్షన్.. ఎమ్మెల్యేలకు శాపంగా మారిన ఆ పథకం?

New Tension For KCR Government

New Tension For CM KCR Government : దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. దళితులను ఉన్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా దళితబంధుకి శ్రీకారం చుట్టింది. దళితబంధు స్కీమ్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. ఈ స్కీమ్ తమకు చాలా ప్లస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, ఇప్పుడు ఇదే పథకం ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్ కు సవాల్ గా మారనుందా? క్షేత్రస్థాయిలో ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దళితబంధు శాపంగా మారనుందా?

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఈ పథకంపై క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.(CM KCR)

Also Read..Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు.. హస్తం గూటికి వేముల వీరేశం, మైనంపల్లి!

హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ దళితబంధు స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థికసాయం అందుతుంది. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దళితులను ఉన్న స్థితికి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రతి నియోజకవర్గానికి 1100మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ఇలా కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. అయితే, ఎన్నికల తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ దళితబంధు.. బీఆర్ఎస్ సర్కార్ కి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 17లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో సగటున 14వేలకు పైగా దళిత కుటుంబాలు ఉంటాయి. అయితే, ప్రభుత్వం 1100 లబ్దిదారులనే మందినే ఎంపిక చేస్తోంది. ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. మరోవైపు ఆర్థిక సాయంగా ఇచ్చే మొత్తం ఏకంగా 10లక్షల రూపాయలు కావడంతో దళితుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. దానికి తగ్గట్టుగా దళితబంధుని ఇవ్వలేని పరిస్థితి ఎమ్మెల్యేలకు ఎదురవుతోంది. లబ్దిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకు అప్పగించడంతో వారు చేతి వాటానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక బీఆర్ఎస్ నేతలు దాదాపు 30శాతం కమీషన్ తీసుకుని దళితబంధు ఇస్తున్నారని సాక్ష్యాత్తు సీఎం కార్యాలయానికే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

Also Read..Chandrababu Interrogation : సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? చంద్రబాబుని అడిగిన ఏసీబీ కోర్టు జడ్జి

దళితబంధు కోసం రోజురోజుకి ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. దళితబంధుకి కౌంటర్ గా అభయహస్తం పేరుతో రూ.12లక్షలు ఇస్తామంది. ఇది స్థానికంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సవాల్ గా మారింది. డిమాండ్ కు తగ్గట్టుగా ఇవ్వలేక, ఇచ్చిన వాటిలోనూ అవినీతి కారణంగా సర్కార్ పై వ్యతిరేకత వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మూడోసారి అధికారంలోకి రావడానికి దళితబంధు మాస్టర్ కార్డుగా ఉపయోగపడుతుందని అనుకున్న గులాబీ నేతలకు ఇప్పుడు గుబులు పట్టుకుంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్టులు, ఫిర్యాదులు, విమర్శలు ఎన్నికల వేళ సర్కార్ ను తెగ కలవరపెడుతున్నాయి. మరి దీన్ని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.