Dasoju Sravan: బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా.. నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేత

బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అంతేగాక, బీజేపీకి చెందిన మరో ఇద్దరు ఉద్యమనేతలు టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ మాజీ నేతలు రేపోమాపో మళ్ళీ సొంత గూటికి చేరనున్నారు. కాగా, మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఏఐసీసీ అధికార ప్రతినిధిగానూ పనిచేసిన దాసోజు శ్రవణ్‌ ఆగస్టు 7న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

Dasoju Sravan: బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా.. నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేత

Updated On : October 21, 2022 / 1:51 PM IST

Dasoju Sravan: బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అంతేగాక, బీజేపీకి చెందిన మరో ఇద్దరు ఉద్యమనేతలు టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరు టీఆర్ఎస్ మాజీ నేతలు రేపోమాపో మళ్ళీ సొంత గూటికి చేరనున్నారు.

కాగా, మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఏఐసీసీ అధికార ప్రతినిధిగానూ పనిచేసిన దాసోజు శ్రవణ్‌ ఆగస్టు 7న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ చుగ్‌ సమక్షంలో అప్పట్లో ఆయన బీజేపీలో చేరారు. శ్రవణ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు శ్ర‌వ‌ణ్‌ రాజీనామా చేశారు. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ తో ఆయన చర్చలు జరిపారు.

బీజేపీ తెలంగాణలో ప్రస్తుతం అనిశ్చితమైన, దిశ దశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని, అందుకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ మేరకు బండి సంజయ్ కు లేఖ రాశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..