telangana farmers : తెలంగాణలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

telangana farmers : తెలంగాణలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు

Telangana Farmers

Updated On : April 5, 2022 / 1:49 PM IST

telangana farmers : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఈ విషయాన్ని లోక్ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 2014తో పోలిస్తే 2020 నాటికి సగానికి సగం రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తొలి ఏడాది మినహాయి.. మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తగ్గుకుంటూ వస్తున్నట్లు పేర్కొన్నారు. 2014 లో 898 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా, 2015లో 1358 మంది రైతులు, 2016 సంవత్సరంలో 632 మంది, 2017 సంవత్సరంలో 846 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

Telangana Farmers : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

ఇక 2018 లో 900 మంది, 2019లో 491 మంది, 2020లో 466 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ అనంతరం సాగునీటి ఇబ్బంది తొలగిందనే చెప్పొచ్చు. వర్షాలు సైతం సంవృద్ధిగా పడుతుండటంతో బోరు, బావుల్లో నీరు పుష్కలంగా లభిస్తుంది. దీంతో రైతులు సాగుచేసిన పంటలకు పుష్పలంగా నీరు లభిస్తుండటంతో కొంత ఇబ్బందులు తప్పినట్లయింది. మరోవైపు తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఊరటనిస్తుంది. రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసే రైతు బంధు పథకాన్ని తెరాస ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టింది.