బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేనివారికి కూడా నగదు అందచేస్తాం

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 06:04 AM IST
బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేనివారికి కూడా నగదు అందచేస్తాం

Updated On : April 27, 2020 / 6:04 AM IST

కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందిస్తామని  పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉండి బ్యాంకు ఎకౌంట్ లేక పోయినా,  బ్యాంకు ఎకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోయినా వారందరికీ  నేరుగా నగదు అందచేస్తామని ఆయన తెలిపారు. 

బ్యాంక్‌ ఖాతాలతో, ఆధార్‌ కార్డు లింక్‌ లేని 5 లక్షల 21 వేల 640 కార్డుదారులకు నగదును బ్యాంకుల్లో  జమ చేయలేక పోయామని  వారందరికీ నేరుగా అందిస్తామని ఆయన వివరించారు. 

వలస కార్మికులందరికీ 12 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం, కుటుంబానికి రూ.500 అందజేశామని తెలిపారు. బ్యాంకులో పడిన నగదు తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందన్న పుకార్లను నమ్మవద్దని ఆ నగదును ఎప్పుడైన తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకుల వద్ద జనం గుమికూడకుండా బౌతిక దూరం పాటించి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.