DOST Schedule : డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌కు దోస్త్ షెడ్యుల్ విడుదల…

కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషిన్ ప్రక్రియకు దోస్త్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

DOST Schedule : డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌కు దోస్త్ షెడ్యుల్ విడుదల…

Dost Schedule Released For Degree Courses New Academic Year

Updated On : June 29, 2021 / 1:35 PM IST

DOST Schedule : కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషిన్ ప్రక్రియకు దోస్త్ షెడ్యూల్ విడుదల అయింది. ఈ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. జూలై 3నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్‌ల ఎంపిక జరుగనుంది. జూలై 13,14 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగనుంది.

మొదటి ఫేస్‌కు సంబంధించిన సీట్లు జులై 22న కేటాయింపు ఉండనుంది. జూలై 23 నుంచి 27జూలై వరకు కాలేజ్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఫేస్ రిజిస్ట్రేషన్ 23 జూలై నుంచి జూలై 27వరకు ఉంటుంది. జూలై 24నుంచి 29 జూలై వరకు సెకండ్ ఫేస్ విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది..

26న స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్ట్ 8న సీట్ల కేటాయింపు ఉండనుంది. ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్ లైన్‌లో చేయాల్సి ఉంటుంది. మూడవ ఫేస్ ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ జరుగనుంది. ఆగస్ట్ 6వ తేదీ నుంచి 11వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఆగస్ట్ 9న స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఆగస్ట్ 18న సీట్ల కేటాయింపు,18వ తేదీ 19వ తేదీల్లో విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్ లైన్‌లో చేయాల్సి ఉంటుంది.ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, మ‌హాత్మాగాంధీ, పాల‌మూరు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు విద్యార్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.