స్వయం సహాయక సంఘాలకు బంపర్ బొనాంజా..

స్వయం సహాయక సంఘాల్లో చేరి గ్రామీణ మహిళలు ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న

స్వయం సహాయక సంఘాలకు బంపర్ బొనాంజా..

self help societys

Updated On : February 26, 2025 / 1:58 PM IST

Self Help Groups: స్వయం సహాయక సంఘాల్లో చేరి గ్రామీణ మహిళలు ఆర్థిక అభ్యున్నతికి బాటలు వేసుకుంటున్నారు. పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యాపారాల నిర్వహణతో ఆర్థికంగా ఎదిగేలా దోహదపడుతుంది. అంతేకాదు.. డ్రైవింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో స్వయం సహాయక సంఘాలు క్యాబ్ సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి.

Also Read: Ration Card : కొత్త రేషన్ కార్డులకోసం అప్లయ్ చేశారా.. మీకోసం బిగ్ బ్రేకింగ్ న్యూస్

సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉంది. దీంతో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు నగరంలో క్యాబ్ సేవలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం జిల్లాలోని 35 మంది మహిళలను గుర్తించారు. వీరికి ఇప్పటికే కారు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా జారీ చేశారు. వీరు కార్లు కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షల చొప్పున బ్యాంకు రుణాలను అందజేశారు. దీనికితోడు హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీలకు ఈ క్యాబ్ లను అనుసంధానం చేయనున్నారు. కొండాపూర్, హైటెక్ సిటీ, నానక్ రాంగూడ తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను అర్ధరాత్రి సైతం సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు, స్వయం సంఘాయ సంఘాల మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఐటీ కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు.

Also Read: Zoological Park: బాబోయ్.. జూ పార్కుకు వెళ్తున్నారా.. అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోండి.. మూవీ షూటింగ్ కెమెరాకు..

స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు అన్ని విధాల అండగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. టైలరింగ్, బ్యూటిషియన్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ స్కిల్స్ వంటి రంగాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. పసుపు, కారం, ఇతర వస్తువులను అంగన్ వాడీ కేంద్రాలు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. మహిళా సహకార డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తువులను ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లా కేంద్రాల్లో మహిళా సూపర్ మార్కెట్లు ఏర్పాటుపైనా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వం చర్యలతో స్వయం సహాయక సంఘాల మహిళలు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు మరింత మెరుగుకానున్నాయి.