కరోనా గ్యాప్ అయిపోయింది.. సిటీలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

Drunk and Drive: హైదరాబాద్ సిటీలో పోలీసు హై కమాండ్ ఆర్డర్ ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా నిలిపేసిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రారంభించారు. రాత్రి వేళల్లో యథావిధిగా పాత స్పాట్‌లలోనే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెడుతున్నారు. బ్రీత్ ఎన్‌లైజర్ ద్వారా వారిని గుర్తించి వెహికల్స్ స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
కరోనా భయంతో బ్రీత్ ఎనలైజర్ ఒకరికి నుంచి మరొకరికి వాడటం వలన వ్యాధి విస్తరించే ప్రమాదం ఉంటుందని కొన్ని నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పూర్థి స్థాయిలో నిలిపేశారు. ఇటీవల సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనీల్‌కుమార్ శుక్రవారం నుంచి డ్రైవ్‌ను నగరంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌ను చేపట్టారు.
గోషామహల్, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, టోలీచౌకి, ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిల్లో ఉన్న ఏరియాల్లో డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు జరిగాయి. కరోనా నేపథ్యంలో కొన్ని నెలలుగా నిలిచిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రారంభం కావడంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు డ్రైవ్ ఏర్పాటు చేసిన ప్రాంతాల నుంచి తప్పించుకోవడానికి ఆల్టర్నేటివ్ రూట్స్ వెదుకుతున్నారు. మళ్లీ పరీక్షలు మొదలుకావడంతో డ్రింకింగ్ బాబులు వాహనాలు నడిపేందుకు కాస్త ఆలోచిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో పూర్తిగా నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ హై కమాండ్ ఆర్డర్ల మేరకు మళ్లీ ప్రారంభించాం. వాహన దారులు మద్యం సేవించి రోడ్డుపైకి రావద్దని సూచిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు జైలుకు పంపించడం ఖాయం. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.