Eatala Rajender : కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకే గజ్వేల్‌లోనూ పోటీ : ఈటల రాజేందర్
గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని ఈటల అన్నారు. హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు.
Eatala Rajender .. CM KCR : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపైనా సీఎం కేసీఆర్ పైనా బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కరీంనగర్ లో ఈటల మాట్లాడాతు..2021 ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ బానిసలుగా వందల కోట్లు ఖర్చు బెట్టి ..ఉద్యమ బిడ్డ ఈటెల రాజేందర్ ను ప్రజాస్వామ్యాన్ని నలిపేయాలని చూశారు అంటూ ఆరోపించారు. హుజూరాబాద్ లో జరిగిన ఉపఎన్నికల్లో తనను పెట్టిన హింసకు శికండి వ్యవహారం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని గజ్వేల్ లో పోటీ చేస్తానని చెప్పానని వెల్లడించారు.
గుండె కాయలాంటి హుజురాబాద్ లో పోటీ చేస్తూనే.. గజ్వేల్ లో పోటీ చేస్తున్నా.. తనను హుజూరాబాద్ ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. హుజురాబాద్ లో ప్రతీ ఇంటిలోను నాయకులు ఉన్నారని..హుజురాబాద్ ప్రజలతో తనకు 20 ఏళ్ల బంధం ఉందని అన్నారు. తనంటే అక్కడి ప్రజలకు ఎంతో మమకారం ఉందని తాను వెళ్లకపోతే దిగులుపడిపోతారని రెండేళ్లనుంచి రాజేందర్ సార్ వస్తలేదని అనుకుంటున్నారని అన్నారు. తనంటే హుజూరాబాద్ ప్రజకలకు అంత ప్రేమ ఉందని భావోద్వేగానికి గురయ్యారు.
ఇక్కడ ఎంఎల్ఎ ఐన తనను ఎంపీ బండి సంజయ్ ని ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల్లో ఆహ్వానించలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ని ఓడించే బాధ్యతతో 119 నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసి.. బీజేపీ జెండా ఎగురావేసే పనిలో ఉన్నామని దానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. హుజురాబాద్ లో కళ్ళల్లో కలయాడే బిడ్డను తాను అంటూ చెప్పుకొచ్చారు. బయటకు కనబడేది వేరు లోపల ఉన్నది వేరు..నూటికి నూరు శాతం ప్రజలు నన్ను ఆశీర్వాదిస్తారు అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఎదుటి పార్టీకి డిపాజిట్ దక్కకుండా విడతల వారీగా కార్యకర్తలు పని చేస్తారని..నా భార్య జమున ఉండి వాడ వాడనా అన్ని ఊళ్ళో ప్రచారంలో పాల్గొంటారని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ వెల్లడించారు.
కాగా భూ కబ్జాల ఆరోపణలతో ఈలట బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ కు ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి హుజూరాబాద్ లో గెలుపొందిన విషయం తెలిసిందే.