తెలంగాణలో కొత్తగా 1,892మందికి.. గ్రేటర్ పరిధిలోనే 1,658 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో గత 24గంటల్లో కొత్తగా1,892 మందికి కరోనా వైరస్ సోకగా.. 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం సోకిన వారి సంఖ్య 20,426 కు చేరుకుంది. తెలంగాణలో కరోనా కేసుల్లో ఇదే అత్యధిక రికార్డు. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా నిన్న మాత్రం ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే? ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొత్తగా 1,658 కేసులు అంటే 87.6 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. 4,073 మందికి నెగటివ్ వచ్చింది. మొత్తం 20,462కేసుల్లో 9,984 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక్క రోజే 1,126 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 283గా ఉంది.
మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,658, రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్ రూరల్‌లో 41, సంగారెడ్డిలో 20, మహబూబ్‌నగర్‌లో 12, నల్గొండలో 13 కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో 7, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాలో ఆరేసి కేసుల చొప్పున నమోదు అయ్యాయి.
ఇక వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 4, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్‌లలో మూడేసి కేసులు, ఖమ్మంలో 2 కేసులు వచ్చాయి. కరీంనగర్, గద్వాల, ములుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
Read:కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ