Road Accident : విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు.

Road Accident : విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

Road Accident

Updated On : December 11, 2021 / 6:28 PM IST

student killed in road accident : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ అదుపు తప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

అబ్దుల్లాపూర్ మెట్ లో లారీ పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్ పై ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

మృతుడు సిరిసిల్ల ప్రగతి నగర్ కు చెందిన పి.ప్రణయ్ గౌడ్ గా గుర్తించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో లారీ అదుపు తప్పినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.