పొంగులేటి పొలిటికల్ బాంబు కామెంట్స్ పై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ముమ్మాటికి దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని పొంగులేటి చెప్పింది నిజమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao: దీపావళికి ముందే రాష్ట్రంలో స్కామ్‌ల బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లాలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముమ్మాటికి దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని పొంగులేటి చెప్పింది నిజమేనని అన్నారు.
Also Read: ఫస్ట్ అరెస్ట్ ఆయనదేనా..? దివాలీలోపు తెలంగాణలో ఏం జరగబోతోంది?
కాంగ్రెస్ పార్టీలోనే బాంబులు పేలుతాయి.. వాళ్ల కుర్చీలు కదులుతాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ముప్పును పొంగులేటి ముందే పసిగట్టాడు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్లకు గుర్తింపులేదని వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం.
Also Read: Unstoppable with NBK S4 : కుదిరితే కప్పు కాఫీ.. భువనేశ్వరితో.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విచారణ అయిన చేయొచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు.