Harish Rao Thanneeru : తులం బంగారం ఏమైంది? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

తులం బంగారం ఇచ్చుడు ఏమో కానీ బంగారం రేటు మాత్రం పెంచారు కాంగ్రెసోళ్లు.

Harish Rao Thanneeru : తులం బంగారం ఏమైంది? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao Thanneeru

Harish Rao Thanneeru : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని నమ్మించి కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. అదే సమయంలో బీజేపీపైనా ఆయన విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలను పెంచి పేదల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ జమానాలో పటాన్ చెరు ప్రాంతంలో ఎంత నీటి గోస‌ ఉండేదో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజైనా నీటి కొరత లేకుండేదన్నారు. కాంగ్రెస్ మళ్లీ వచ్చింది.. నీటి కొరత ఏర్పడిందని వాపోయారు.

”తులం బంగారం ఇస్తామని చెప్పిన రేవంత్.. సీఎం అయ్యాక ఇప్పటివరకు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చుడు ఏంటో కానీ బంగారం రేటు మాత్రం పెంచారు కాంగ్రెసోళ్లు. అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్. అబద్దాలు చెప్పడంలో బీజేపీ బడే బాయ్.. కాంగ్రెస్ చోటా బాయ్. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ అబద్దాలు చెప్పడంలో రేవంత్ ను మించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే. వంద కోట్లతో విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. పటాన్ చెరు నియోజకవర్గం స్థానికుడైన వెంకట్రామిరెడ్డికి ఓటేసి గెలిపించండి” అని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ స్థాయి మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు.

Also Read : సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు