ముఖ్యమంత్రా? రియల్ ఎస్టేట్ బ్రోకరా?- సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

అక్కడ చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టి.. మిగతా 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడంట.

ముఖ్యమంత్రా? రియల్ ఎస్టేట్ బ్రోకరా?- సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao (Photo Credit : Facebook, Google)

Updated On : October 3, 2024 / 7:14 PM IST

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. ఆనాడు కేసీఆర్ ఫార్మా సిటీ కోసం రైతులను ఒప్పించి వారి నుంచి 15వేల ఎకరాలను సేకరించారని గుర్తు చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. కానీ, రేవంత్ రెడ్డి వచ్చాక ఫార్మా సిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రా? లేక రియల్ ఎస్టేట్ బ్రోకరా? అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ భూముల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీశ్ రావు.

”రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఎటు విసురుతాడో తెలియదిక. ఆ రాయి ఎటు విసురుతాడో, ఎవరి మీద పడుతుందో తెలియకుండా అయిపోయింది. ఆనాడు కేసీఆర్.. హైదరాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా అక్కడ ఫార్మా సిటీ పెట్టేందుకు 15వేల ఎకరాల జాగా తయారు చేసి పెట్టారు. అన్ని అనుమతులు వచ్చాయి. ఢిల్లీ నుంచి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ వచ్చింది. అటవీ అనుమతులు వచ్చాయి. దానికి భూసేకరణ అయిపోయింది. రోడ్లు వేశారు. మొత్తం తయారు ఉంది. వంట వండేశారు. వడ్డించడమే తరువాయి.

కానీ, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే.. అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతారంట రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బేరం చేస్తారంట. ప్లాట్లు అమ్ముతారట. ముఖ్యమంత్రి బేరం చేస్తారా? ప్రజలను చూసుకుంటారా? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? రియల్ ఎస్టేట్ బ్రోకరా? ఫోర్ట్ సిటీ కడతారట. ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతున్నారు.

మొన్న హైకోర్టు అడిగింది. ఫార్మా సిటీ ఉన్నట్లా? లేనట్లా? అని అడిగింది. కింద మీద అవుతుందేమో అని ఉన్నట్లే అని హైకోర్టుకి రాసిచ్చారు. కానీ, ఎన్ని ఎకరాల్లో ఉన్నట్లో చెప్పడం లేదు. ఆయన ఉపాయం ఏంది? అక్కడ చిన్నగా మూడు నాలుగు వేల ఎకరాల్లో ఫార్మా సిటీ పెట్టి.. మిగతా 10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడంట. ప్లాట్లు పెట్టి అమ్ముతారట. ఆయన మనుషులకు ఆ 10వేల ఎకరాలు కట్టబెట్టి దాన్ని తెచ్చి మన ఊరు మీద వేస్తున్నారు” అని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

Also Read : కొండా సురేఖ వివాదం.. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు