Covid Exgratia : కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి

కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి దరఖాస్తులు కోరింది.

Covid Exgratia : కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి

Covid Exgratia

Updated On : January 4, 2022 / 7:01 PM IST

Covid Exgratia : కరోనాతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.50వేలు పరిహారంగా ఇవ్వనుంది. దీనికి సంబంధించి మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు కోరింది. రాష్ట్రంలో కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబసభ్యులు దీనికి అర్హులు. కరోనాతో చనిపోయిన వారి సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Offline Payments : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్… ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!

ఇందుకోసం మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ తెలిపింది. అందుకోసం తమ బంధువు కోవిడ్ తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో అప్లయ్ చేసుకోవాలంది. ఈ దరఖాస్తులో బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర అవసరమైన పత్రాలు జత పరచాలని తెలిపింది.

Pani Puri : స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదేనా?

జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉండే కోవిడ్ డెత్ నిర్దారణ కమిటీ.. కోవిడ్ 19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత విచారణ జరిపి మరణించిన వారి సమీప బంధువుల ఖాతాల్లో ఎక్స్-గ్రేషియా మొత్తం జమ చేస్తారు.

రాష్ట్రంలోని 4వేల 500 మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు మీ-సేవా ఫోన్ నెంబర్ 040 -48560012 సంప్రదించాలన్నారు. అలాగే meesevasupport@telangana.gov.in అనే మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.