హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

Updated On : January 5, 2021 / 4:29 PM IST

Fire accident at KukatPally in Hyderabad : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

కూకట్ పల్లిలో మొదటగా చిన్నగా మొదలైన అగ్నిప్రమాదం ఒక్కసారిగా దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న మిగతా షాప్ యజమానులు గమనించి పోలీసులు, స్థానికంగా ఉన్న ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు మంటలను అదపు చేశారు.

టీవీ షో రూమ్ కావడంతో ఎలక్ట్రిక్ కు సంబంధించిన ఐటెమ్స్ అన్ని కూడా మంటలకు కాలిపోయాయి. ప్రస్తుతం మంటలను కొద్ది మేరకు అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.