వైఎస్‌ షర్మిల పార్టీ రాజకీయ సలహాదారులుగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌

వైఎస్‌ షర్మిల పార్టీ రాజకీయ సలహాదారులుగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌

Updated On : February 17, 2021 / 3:58 PM IST

YS Sharmila’s political party : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్‌ షర్మిల దూకుడు పెంచారు. షర్మిల రాజకీయ పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్‌ ఉదయ్‌కుమార్‌ సిన్హాను నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 17, 2020) ప్రభాకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ సిన్హా లోటస్ పాండ్ లో షర్మిలను కలిశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సీఎంవోలో ప్రభాకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ సిన్హా కీలక పదవుల్లో పనిచేశారు.

అటు బ్రదర్‌ షఫీ కూడా షర్మిలతో భేటీ అయ్యారు. షర్మిల ఆహ్వానం మేరకు లోటస్‌పాండ్‌కు వచ్చిన ఆయన షర్మిలతో సమావేశమయ్యారు. యూత్‌లో షఫీకి మంచి పాలోయింగ్‌ ఉండటంతో యువతను ఆకర్షించేందుకే షఫీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.