వేములవాడ కోడెలు మృతిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ ..

వేములవాడలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు.

వేములవాడ కోడెలు మృతిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్ ..

Updated On : June 4, 2025 / 2:32 PM IST

Harish Rao: వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక కామెంట్స్ చేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన గోశాలలో కోడెలు మృతిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కవిత పోరాటం.. రాజకీయ ఉనికి కోసమే : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వం పశువులకు గడ్డి పెట్టదు.. ఎర్రగడ్డ ఆస్పత్రిలో మానసిక రోగులకు అన్నం పెట్టదు అంటూ విమర్శించారు. రైతులకు బకాయి పడిన పంట సాయం మూడు పంటలకు రూ.18వేలు తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు. రేపు జరగనున్న క్యాబినెట్ మీటింగ్‌లో రైతు బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేదని హరీశ్ రావు విమర్శించారు. రైతులకు రైతు బందు, రైతు బీమా చెల్లించడానికి మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర పైసలు లేవు.. కానీ, అందాల పోటీ కాంట్రాక్టులకు ఇవ్వడానికి పైసలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రైతులకు విత్తనాలు అందుబాటులో లేవు, కానీ, విత్తనాల ధరలు మాత్రం పెంచారంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మంగళవారం ఆరు కోడెలు మృత్యువాత పడ్డాయి. ఇప్పటి వరకు గోశాలలో 26 పశువులు చనిపోయాయని, మరో నాలుగు కోడెలు అనారోగ్యం పాలయ్యాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న కోడెలకు వెటర్నరీ వైద్యులు వైద్యం అందిస్తున్నారు.