Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ ఇచ్చిన సమాచారంతో..
ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు.

Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూలై 1 విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. జూన్ 30వ తేదీ వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు.
కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్ ని రెండుసార్లు విచారించారు ఏసీబీ అధికారులు. రెండోసారి కేటీఆర్ ని విచారించిన తర్వాత వచ్చిన సమాచారంతో అరవింద్ కుమార్ కు నోటీసులు పంపింది ఏసీబీ. ఈ నెల 30న అరవింద్ కుమార్ హైదరాబాద్ కు రానున్నారు.
Also Read: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఆ తేదీలోగా నిర్వహించాలని ఆదేశం..