Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి

అబ్దుల్ అనే (24 ) ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేశారు. చికిత్స కోసం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ చికిత్స పొందుతున్నారు.

Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. గంజాయి మత్తులో యువకుడిపై కత్తులతో దాడి

Attack

Updated On : February 16, 2022 / 10:03 AM IST

attacked with knifes : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. గంజాయి మత్తులో నలుగురు యువకులు… ఓ యువకుడిపై మూకుమ్మడిగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పాతబస్తీలోని భవానీ నగర్ సిద్దిక్ నగర్ లో అతిక్, విక్రమ్, మైకేల్, చమక్ అనే యువకులు గంజాయి మత్తులో ఓ ఇంట్లోకి చోరబడ్డారు.

అబ్దుల్ అనే (24 ) ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేశారు. చికిత్స కోసం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ చికిత్స పొందుతున్నారు. అతిక్, విక్రమ్, మైకేల్, చమక్ అనే యువకులు సిద్దిక్ నగర్ లో గంజాయి సేవిస్తూ స్థానికంగా కొందరితో గొడవకు దిగినట్లు బాధితుడు తెలిపాడు.

Hyderabad Murder : హైదరాబాద్‌లో పట్టపగలే యువకుడి దారుణ హత్య

వీరికి అబ్దుల్ అనే యువకుడికి మాటా మాటా పెరగడంతో గొడవ జరిగింది. దీంతో అతిక్, విక్రమ్, మైకేల్, చమక్ పరార్ ఇంట్లోకి చొరబడి అబ్దుల్ పై కత్తులతో దాడి చేశారు. బాధిత కుటుంబం భవానీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.