Gone Prakash : కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట రమణారావుపై గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు, విదేశీ నగదు లావాదేవీలపై ఫిర్యాదు
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదాయపన్ను శాఖ,ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నారని..ఇన్ కమ్ టాక్స్ చట్టం,PMLA చట్టం,FEMA చట్టం, బినామీ చట్టం,ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

Gone Prakash
Gone Prakash ..Chintakunta Vijaya Ramana Rao : పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. విజయ రమణారావు ఆదాయపన్ను శాఖ, ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నారని.. ఆదాయపన్ను చట్టం, PMLA చట్టం, FEMA చట్టం, బినామీ చట్టం,ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రమణరావు ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించని రెండు పాన్ కార్డులు, ఆస్తులు,అప్పులు,విదేశీ నగదు లావాదేవీల అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం,ఈడీ, ఆదాయపన్ను శాఖ,కేంద్ర హోంశాఖ, ఆర్ధిక శాఖకు గోనె ప్రకాశ్ ఫిర్యాదు చేశారు.రమణారావు ఆస్తులు,ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనని అంశాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రమణారావు దాఖలు చేసిన ఆస్తి వివరాలను నమోదు చేసిన పాన్ నెంబరు AFNPJ8012P, ప్రస్తుతం 2023 ఎన్నికల్లో పాన్ నెంబరు BEZPC6030E ఇచ్చారు. రమణారావు 2018-19 నుండి 2020-21 వరకు ఎటువంటి ఆదాయ వివరాలను తెలియజేయలేదని..రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ వివరాల్లో రూ 6.35 లక్షల వ్యక్తిగత అప్పు ఉందనీ, ఇంటి మీద రూ.51 లక్షల అప్పుతో పాటు వ్యవసాయేతర అప్పు కూడా ఉందని పేర్కొన్నారు.
అప్పుల వివరాలను 2018-19, 2019 – 20, 2020 – 21 సంవత్సరాలలో పొందుపరచలేదని.. 2014 ఎన్నికల అఫిడేవిట్లో పొందుపరిచిన రెండు ఖాతాల వివరాలు ప్రస్తుత 2023 అఫిడవిట్ లో లేవన్నారు. బ్యాంకు ఖాతాలు, పెద్ద మొత్తంలో అప్పు ఉన్నప్పటికీ ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఏమీ లేవని పేర్కొన్నారు. ఇటువంటివి ఇన్ కమ్ టాక్స్ అధికారులను తప్పిదారి పట్టిస్తున్నారని ఇన్ కమ్ టాక్స్ సంస్థపై సామాన్యులకు వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉందన్నారు.
విజయ రమణారావు ఆస్తులు, సేవింగ్స్ ఖాతాలను, అప్పుల విషయాలు, దాచిపెట్టిన సొమ్మును, డబ్బు తీసుకున్న వివరాలపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తికి రెండు పాన్ నెంబర్లు ఉండడం చట్ట విరుద్ధమని . ఆదాయ పన్నుల శాఖ నియమాలకు విరుద్ధమని..ఎలక్షన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తి నిబద్ధతగా తన ఆస్తుల వివరాలను సమగ్రంగా ఎలక్షన్ కమిటీ ముందు సమర్పించాల్సి ఉంటుందని..ఆయనకు జర్మనీలో బ్యాంకు ఎకౌంట్ ఉందని పేర్కొన్నారు.
అంతేకాదు విజయ రామణరావు భార్య ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని ఆరోపించారు.2021 ఆగస్టు 19న OCBC అనే హాంగ్ కాంగ్ బ్యాంకు నుండి ప్రభాకరన్ వేణు అకౌంట్ నుంచి విజయ రమణారావు అకౌంట్ నెంబర్ 40,50,000 సింగపూర్ డాలర్లు మార్పిడి జరిగిందిని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలను ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచకపోవడం అనేది తీవ్రమైన చర్య అని.. చట్టం ప్రకారం రమణారావు శిక్షార్హుడని అన్నారు.
Also Read: తెలంగాణలో రైతులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
మే బ్యాంకు నుండి 20-1-2022 న దురై స్వామి కుమార్వెల్ అకౌంట్ నెంబరు.21180057063 నుండి చింతకుంట విజయ రమణారావు అకౌంట్ నెంబర్.21180036219 కు 19,00,000 సింగపూర్ డాలర్లు లావాదేవీలు జరిగాయని బ్యాంకు నుండి తీసుకున్న SGD & Foreign Currency Fund Transfer Form ను బట్టి తెలుస్తుందని.. విదేశీ కరెన్సీ వచ్చిన వివరాల రహస్యంగా ఉంటచటం.. బినామీ చట్టం ప్రకారం నిజాలను దాచి పెట్టడమేనన్నారు.
Also Read: మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు
కాగా.. Banco Central Do Brasil Bank నవంబర్ 2019 వరకు అకౌంట్ నెంబర్ 508899 చింతకుంట పేరు మీద 20,09,500.00 యూరో కరెన్సీ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం. 2014లో తయారైన బ్లూ కలర్ BMW కారు రిజిస్ట్రేషన్ నెంబర్ MN6649 రమణారావు పేరుమీద ఉన్నప్పటికీ ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదని పేర్కొన్నారు.
Also Read: కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?
చింతకుంట విజయ రమణారావుకి, KAIZEN CORPORATE SERVICES LIMITED అనే రియల్ ఎస్టేట్, బిల్డర్ సంస్థలో అక్కడి లోకల్ అడ్రస్ పేరు మీదుగా సభ్యత్వం ఉంది అనే విషయాన్ని కూడా అఫీడవిట్ లో పేర్కొనలేదని..మలేషియాలో, మలేషియా ల్యాండ్ రెవెన్యూ అథారిటీస్ దృవీకరించిన లాట్ నెంబర్ 93 49.లో 60.786 హెక్టార్ల (91 Acrs) భూమి చింతకుంట విజయ రమణారావు పేరుమీద ఉన్నట్లుగా సమాచారం అంటూ గోనె ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సమర్పించిన ఆధారాలపై దర్యాప్తు జరపాలని ఈసీ,ఆదాయపన్ను శాఖ,ఈడీ, హోమ్ శాఖ,ఆర్ధిక శాఖ ను కోరారు గోనె ప్రకాశ్.