Telangana Govt: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కొత్త మార్గదర్శకాలు జారీ
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.

Telangana Student
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది.
Also Read: Telangana Cabinet Expansion : శాఖల మార్పులు? మంత్రులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్, రోస్టర్ విధానాలను కచ్చితంగా పాటించాలి. తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్ సైట్లలో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో(ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున) రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో 20 మార్కులుంటాయి. వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. అభ్యర్థి పరిజ్ఞానం, సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులిస్తారు.
Also Read: Gossip Garage : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..
రాష్ట్రలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్శిటీ సహా 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం 2,817 మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు 1,524. అయితే, ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది.
నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వర్శిటీలకు 12ఏళ్లుగా ఉన్న సమస్య తీరనుంది. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది శభవార్తేనని చెప్పొచ్చు.