Telangana Cabinet Expansion : శాఖల మార్పులు? మంత్రులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..

దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయం మంత్రుల్లో కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.

Telangana Cabinet Expansion : శాఖల మార్పులు? మంత్రులను టెన్షన్ పెడుతున్న క్యాబినెట్ విస్తరణ అంశం..

Updated On : April 6, 2025 / 6:47 PM IST

Telangana Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ క్లైమాక్స్ కు చేరుతుంటే ఆశావహులతో పాటు మంత్రులు కూడా టెన్షన్ పడుతున్నారట. అసలు క్యాబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అని ఆశావహులు అయోమయంలో ఉంటే, శాఖలు మారిపోయాయంటూ మంత్రులు ఫీల్ అవుతున్నారట. శాఖల మార్పు నిర్ణయం వల్లే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోందనే గాసిప్స్ గాంధీభవన్ లో రీసౌండ్ చేస్తున్నాయి. దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయం మంత్రుల్లో కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ థ్రిల్లర్ సినిమాను మించిన సస్పెన్స్ ను క్రియేట్ చేసింది. ఇదిగో లిస్ట్, అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తున్నారు తప్ప.. ఇప్పటివరకు పదవులు పంచింది లేదు. ఏప్రిల్ 3న విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నా వర్కౌట్ కాలేదు. ఈసారి క్యాబినెట్ విస్తరణకు తుది కసరత్తు జరుగుతోందని, మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఉన్న అమాత్యుల్లో ఎవరి శాఖలు మారబోతున్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా డీకే అరుణ..? అసలు జాతీయ నాయకత్వం వ్యూహం ఏంటి..

పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది. సచివాలయంలోనే ఓ శాఖా మంత్రి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళనలు కూడా చేశారట. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారని గాంధీభవన్ లో చర్చించుకుంటున్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రుల శాఖలను మార్చాలనే అభిప్రాయాన్ని హైకమాండ్ ముందు ఉంచారని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో తీసివేతలు తప్పవని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కొందరు మంత్రులు తమ శాఖలు మార్చాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారట. కీలకమైన విద్యాశాఖను తనకు కేటాయించాలని ఓ సీనియర్ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హోంశాఖను ఇవ్వాలని మరో మంత్రి కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ టాక్. దీనికి తోడు ఒకరిద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తారనే బలమైన టాక్ నడుస్తోంది. ఇన్ని పరిణామాల మధ్య మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు తప్పవనే చర్చ ఊపందుకుంది.

Also Read : రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఏప్రిల్ రెండో వారంలో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఆశావహుల్లో జోష్ పెంచుతుండగా తమ శాఖలకు కత్తెర పడుతుందేమో అన్న భయం మంత్రులను వెంటాడుతోంది. ఇలా అందరిలో క్యాబినెట్ విస్తరణ అంశం టెన్షన్ పుట్టిస్తోంది.