Gossip Garage : ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర కోణం? దుమారం రేపుతున్న మంత్రుల వ్యాఖ్యలు..
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు... ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.?

Gossip Garage : ఇష్యూ విద్యార్థులది. ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలైంది పేద విద్యార్థులు. కారణమేంటో తేల్చాల్సిన ప్రభుత్వం అపోజిషన్ ను టార్గెట్ చేస్తుంది. బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందంటూ కాంగ్రెస్ మంత్రులు కామెంట్ చేయడం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. దీంతో తెలంగాణలో ఫుడ్ పాయిజన్ పాలిట్రిక్స్ కాక రేపుతున్నాయి. హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే..మంత్రులు తమను టార్గెట్ చేయడమేంటని మండిపడుతోంది అపోజిషన్. ఇంతకీ పుడ్ పాయిజన్ లొల్లి ఏందీ.? మంత్రుల చెప్తున్నట్లుగా కుట్ర కోణం ఉందా? ప్రభుత్వం ఆరోపణలకు బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి.?
ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో ఎక్కడో ఓ చోట వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు..
ఫుడ్ పాయిజన్.. తెలంగాణ పాలిటిక్స్ ను ఈ ఇష్యూ హీటెక్కిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రతిపక్షాలు ఆయుధంగా… మలుచుకుని సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఎపిసోడ్ లో కుట్ర ఉందంటూ మంత్రులు సీతక్క, కొండా సురేఖ చేసిన కామెంట్స్.. రచ్చ క్రియేట్ చేస్తున్నాయి. మొన్న వాంఖిడి గురుకుల పాఠశాల, నిన్న నారాయణపేట్ జిల్లా, మాగనూర్ పాఠశాలలో..విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో..రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంతేకాదు..ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో ఎక్కడో ఓచోట… వరుసగా ఫుడ్ పాయిజన్ వ్యహారం బయటికొస్తుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురిచేస్తుంటే.. దీన్ని ఆయుధంగా మలుచుకునని ప్రతిపక్షాలు..సర్కార్ పై విమర్శల దాడి పెంచుతున్నాయి.
ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై హైకోర్ట్ సీరియస్..
ఫుడ్ పాయిజన్ లో మృతి చెందిన శైలజ నుంచి..మగనూర్ ఘటన వరకు… ఎజెండాగా తీసుకుంది బీఆర్ఎస్. గతంలో గురుకులాల సెక్రటరీగా క్లీన్ రికార్డ్ ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా గురుకులాల బాట పట్టారు. దీనికి తోడు హైకోర్ట్ కూడా ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై సీరియస్ అయింది. పిల్లలు చస్తుంటే తప్ప పట్టించుకోరా.? అంటూ సర్కార్ ను ప్రశ్నించింది. విపక్షాలకు కోర్ట్ వ్యాఖ్యలు మరింత బలంగా మారాయి.
దుమారం రేపిన మంత్రి సీతక్క కామెంట్స్..
ఇటు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు…అటు హైకోర్టు మొట్టికాయలు..మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు..సర్కార్ ను కలవరపెడుతున్నాయి. దీంతో పాఠశాలలు, జిల్లా స్థాయిలో ఫుడ్ సేఫ్టీకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వరుస సమీక్షలు నిర్వహించిన తర్వాత… సర్కార్ పేల్చిన బాంబ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఫుడ్ పాయిజన్ వ్యవహారం వెనక.. కుట్ర ఉందని..దీనిపై త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని.. మంత్రి సీతక్క చేసిన కామెంట్స్..ఇప్పుడు మరో దుమారానికి తెర లేపుతున్నాయి.
ఫుడ్ పాయిజన్ వ్యవహారం వెనుక కుట్ర ఉందన్న మంత్రులు..
అంతే కాదు లగచర్ల, ఫుడ్ పాయిజన్ ఘటనల్లో బీఆర్ఎస్ హస్తం ఉన్నట్లు అనుమానం ఉందని..ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఇదంతా చేస్తున్నారంటూ మరో మంత్రి కొండా సురేఖ దుమారం లేపారు. ఇక మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కూడా రంగంలోకి దిగారు. ఏకంగా ఫుడ్ పాయిజన్ జరిగిన హాస్టల్ కి వెళ్లి విద్యార్థులు, అధ్యాపకులతో బేటీ అయ్యారు. ఎక్కడేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అయితే ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంటే..ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఎందుకు వేశారని ప్రశ్నిస్తోంది అపోజిషన్. తప్పులను సరిదిద్ది విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించాల్సిన సర్కార్..నెపం తమ మీద నెట్టడం ఏంటని క్వశ్చన్ చేస్తోంది.
కుట్రలు చేస్తోంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు?
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు… ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.? విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయంలో కుట్రలు చేస్తోంటే…అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్లు..? ఈ ప్రశ్నలన్నీ… ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశంలో ..ప్రభుత్వం, ప్రతిపక్షాలు..రాజకీయ కోణంలో చూడకుండా ఉన్నత విద్య, మంచి ఫుడ్ అందించడంపై ఫోకస్ పెట్టాలంటున్నారు విద్యావేత్తలు.
Also Read : ఈసారైనా గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా? రారా? ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు..