Gossip Garage: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ ముగ్గురు Rల గురించి పార్టీలో ఎందుకంత చర్చ..

చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఏం తక్కువ తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడ్ని కాదంటూ తెరపైకి వచ్చారాయన.

Gossip Garage: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ ముగ్గురు Rల గురించి పార్టీలో ఎందుకంత చర్చ..

Updated On : July 2, 2025 / 11:30 PM IST

Gossip Garage: పదవి దక్కిందనే ఆనందం ఒకరిది. ఇంకొకాయనది అసంతృప్తి రాగం. అధ్యక్ష పోస్ట్ దక్కకపోవడంతో మరో నేత సైలెంట్‌ మోడ్. ఇలా బీజేపీ Rతో నేమ్‌ స్టార్ట్‌ అయ్యే ఆ ముగ్గురు నేతలు..డిఫరెంట్‌ మూడ్‌లో ఉన్నారట. ఇంతకు సంబరాలు చేసుకుంటున్న R ఎవరు? రచ్చ చేస్తున్న మరో R రూటెటు? సైలెంట్ అయిన ఇంకో R ఏం చేయబోతున్నారు?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడంతో కమలం పార్టీలో..ఆ ముగ్గురు ట్రిబుల్ ఆర్ లీడర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీలో ఇప్పుడు ట్రిబుల్ ఆర్ అనగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన రామచంద్రరావు ఒకరైతే..ఈటల రాజేందర్, రాజాసింగ్ మరో రెండు Rలు. ఇప్పుడు ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసినా ఈ ట్రిపుల్ ఆర్ గురించే చర్చించుకుంటున్నారట. ఈటల రాజేందర్ ఎవరిని కలుస్తున్నారు.? ఏం మాట్లాడుతున్నారు? ఆయన భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయని దానిపైన రాష్ట్ర పార్టీ ఆఫీస్‌లో పెద్ద చర్చే జరుగుతోందట. అధ్యక్ష ఎన్నిక వేళ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్‌పైనా పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. రాజాసింగ్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు? ఆయన రాజీనామాతో జరిగే నష్టం ఎంత? అని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు.

రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాంచందర్‌రావు సంబరాలు చేసుకుంటున్నారు. రామచందర్‌రావుకు అధ్యక్ష పదవి దక్కడంతో బీజేపీలోని పాత నేతలు అంతా తమకే అధ్యక్ష పదవి దక్కినంత ఆనందంలో ఉన్నారట. ఏబీవీపీ నుంచి ఎదిగి..నక్సలైట్లతో, రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో కొట్లాడిన తమలో ఒకడికి పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని ఫీలవుతున్నారట. ఇందులో కిషన్ రెడ్డి, బండి లక్ష్మణ్ లాంటి నేతలున్నారు.

నేను ఫ్లవర్ కాదు ఫైర్..!
ఇలా ఓవైపు రాంచందర్‌రావు ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా మరికొంతమంది మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. రామచందర్‌రావు సౌమ్యుడు ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుంది, అగ్రెసివ్‌గా ఉండే వారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాల్సిందని కొందరు మాట్లాడుకుంటున్నారట. ఈ విషయంలో రామచందర్‌రావు కూడా కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షుడు అయిన తర్వాత ఇచ్చిన మొదటి ప్రసంగంలో తాను ఫ్లవర్ కాదు ఫైర్ అనే చెప్పుకునే ప్రయత్నం చేశారు.

Also Read: మళ్లీ పాదయాత్ర అంటున్న జగన్..! పాత ఫార్ములా తిరిగి పగ్గాలు దక్కేలా చేస్తుందా?

ఇంకా ఏం చేస్తే పార్టీ గుర్తిస్తుంది అంటూ ఆవేదన..!
అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్ రెండు రోజులుగా సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు అనే చర్చ మొదలైనప్పటి నుంచి ఈటల రాజేందర్‌కే పదవి దక్కడం ఖాయమనే చర్చ సాగింది. ఆల్‌ మోస్ట్‌ ఈటలనే అధ్యక్షుడు..ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్న లీకులు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆయన అనుచరులు ఇదే అంశాన్ని పదే పదే పోస్ట్ చేస్తూ వచ్చారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈటల తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్‌ అయ్యే వారు. కానీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న కొంతమంది నేతలు అడ్డుపడటం వల్లే..రాష్ట్ర అధ్యక్ష పదవి చేతి దాకా వచ్చి జారిపోయిందని బాధపడుతున్నారంట. ఇంకేం చేస్తే పార్టీ తనను గుర్తిస్తుందంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఈటల.

ఇక మరో R..రాజా సింగ్ పార్టీలో రచ్చ రచ్చ చేస్తున్నారు. చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఏం తక్కువ నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదంటూ తెరపైకి వచ్చారాయన. అయితే తనకు అధ్యక్ష పదవి రాలేదన్న బాధ కంటే..రాంచందర్‌రావుకు ఎందుకిచ్చారన్నది ఆయన కోపమట. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉంటూ రామచందర్‌రావు తనను ఇబ్బంది పెట్టారని..రాష్ట్ర అధ్యక్షుడైతే ఆయన మరోసారి తను ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో..ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట రాజాసింగ్.

ఇలా ఆ ముగ్గురు Rతో నేమ్‌ స్టార్ట్‌ అయ్యే నేతలు..తలా ఒక పరిస్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. రామ్‌చందర్‌రావుది సంబరమైతే..ఈటల రాజేందర్ మదనపడుతున్నారట. ఇక ఇంకో R రాజాసింగ్‌.. ఆల్‌మోస్ట్ పార్టీకి దూరమైనంత పని చేస్తున్నారు. ఓవరాల్‌గా ఇప్పుడు బీజేపీలో RRR లీడర్ల చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది.