Gossip Garage: కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యేల న్యాయపోరాటం.. సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? అసలు వారి టార్గెట్ ఎవరు?
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.

Gossip Garage: కూల్చివేతల కోసం పట్టు. ఆ నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల న్యాయపోరాటం. హస్తం పార్టీలోనే కాదు..తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే హైకోర్టు మెట్లెక్కడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. పైకి ఆక్రమణల మీదే వాళ్ల ఆక్రోశం అయినా..టార్గెట్ మాత్రం వేరేనట. ఓ మంత్రితో పాటు మరో ముఖ్య నేతను ఇరకాటంతో పెట్టేందుకు మరో మంత్రే ఈ స్కెచ్ వేశారన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ నలుగురు ఎమ్మెల్యేలెవరు… వారి వెనుక ఉండి చక్రం తిప్పుతున్నదెవరు..
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారంటూ కోర్టులో పిల్ వేశారు నలుగురు అధికార పార్టీ శాసనసభ్యులు. గత ప్రభుత్వం సదరు ప్రైవేటు కంపెనీకి ఎన్ వోసీ ఇచ్చిందట. దాన్ని రద్దు చేసి ఆక్రమణలు కూల్చివేయాలన్నది ఎమ్మెల్యేల డిమాండ్ అట.
ఇంతవరకు కరెక్టే కావొచ్చు. కానీ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? పురపాలక శాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆక్రమణ కథేంటో తేల్చొచ్చు కదా అంటే..ఎమ్మెల్యేలు చెప్పే సమాధానం గత ప్రభుత్వం నిర్ణయం కాబట్టి పిటిషన్ వేశామని చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తే సమీక్షించి పరిష్కరించ లేరా అంటే నో కామెంట్ అంటున్నారట ఆ నలుగురు ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఖాజాగూడలో ప్రభుత్వానికి చెందిన భూమిని ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తోందంటూ కోర్టులో పిల్ వేశారు హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. కోర్టు మెట్లెక్కిన ఎమ్మెల్యేల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌లు ఉన్నారు. వీరెవరూ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు కాదు.
అయితే ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు మెట్లు ఎక్కడంపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకిలా చేశారంటూ ఆరా తీస్తున్నారు. పవర్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి సమస్యను సీఎం దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. అయినా వీరెందుకు ఇలా కోర్టు మెట్లు ఎక్కారనేది డిస్కషన్ పాయింట్‌గా మారింది. అయితే దీని వెనుక కాంగ్రెస్ గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: ‘రైతు భరోసా’ డబ్బులు మీ అకౌంట్లలో ఇంకా పడలేదా..? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులొచ్చేస్తాయ్..
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట. ఈ వ్యవహారంలో రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్న పొంగులేటితో పాటు మున్సిపల్ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎంను టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్య కాస్త సైలెంట్ అయిన రేవంత్ కేబినెట్ లోని సహచర మంత్రే… ఈ ఇంట్రెస్టింగ్ కథ నడిపిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అది ప్రభుత్వ భూమే కావొచ్చు. ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్ లు కడుతుండొచ్చు. ఇవన్నీ సీఎంకు తెలియవా? తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదా? అందుకే ఎమ్మెల్యేలు కోర్టుకెళ్లారా అంటే తెర వెనుక కథ వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టులో ఉండటంతో ఎటువైపునకు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది.