Gossip Garage: తెలంగాణ రాజకీయాల్లో ‘కొత్త’ మంటలు.. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నదెవరు?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.

Gossip Garage: తెలంగాణ రాజకీయాల్లో ‘కొత్త’ మంటలు.. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నదెవరు?

Updated On : April 15, 2025 / 9:27 PM IST

Gossip Garage: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పడిపోవాలని కొంతమంది కోరుకుంటున్నారా? మాకొద్దీ కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారా? ఎవరిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు? రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవసరమైతే సాయం కూడా చేస్తామని ఆ కొందరు అంటున్నారా? మరో మూడున్నరేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలని గులాబీ బాస్ కేసీఆర్ కోరుకుంటుంటే.. ఇలాంటి సమయంలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ ను పడగొట్టడానికి అవసరమైతే తాము సాయం చేస్తామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్న ఆ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరు?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్న ఆ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరని ఇటు ప్రభుత్వం పెద్దలు, అటు ప్రతిపక్షాలు కూడా ఆరా తీస్తున్నాయంట. మరో మూడున్నరేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగాలని కొద్దిరోజుల క్రితం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా మారాయి.

Also Read : సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకయ్యే ఖర్చు భరిస్తాం?
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసుగు చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలమే రేపుతున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని.. అంతేకాదు వాటికయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని వారు తనతో చెప్పినట్లు తోగుట సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పెద్ద బాంబే పేల్చారు.

తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి తీవ్రంగా ఉందన్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ఏ ఒక్క వర్గం కూడా రేవంత్ సర్కార్ పట్ల సంతృప్తిగా లేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే దాని గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ప్రభాకర్ రెడ్డి చెబుతున్నట్లు నిజంగానే బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అంత కోపంగా ఉన్నారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, దానికి తోడు హైడ్రా వల్ల నిర్మాణ రంగం నీరుగారిపోయిందని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇదే సమయంలో పారిశ్రామిక రంగం సైతం చతికిలపడిపోయిందని, ప్రభుత్వానికి సరైన ఇండస్ట్రియల్ పాలసీ లేనందువల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

Also Read : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. డబ్బులు రిలీజ్ చేసిన ప్రభుత్వం.. మీకు వస్తాయో రావో చెక్ చేసుకోండి..

కేసీఆర్‌ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారని ఆరోపణలు..
అయితే దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ పై మండిపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించిన మంత్రి.. తమ జోలికొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్‌ ఆత్మ అని.. కేసీఆర్‌ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారని ఆరోపించారు. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై అవసరమైతే విచారణకు ఆదేశిస్తామన్నారు మంత్రి పొంగులేటి.

ఇదిలా ఉంటే రేవంత్ సర్కార్ పై అంతలా కోపం పెంచుకున్న ఆ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరా అని ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు ప్రతిపక్షాలు సైతం ఆరా తీస్తున్నాయట. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేంత ధైర్యం చేసే బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఎవరున్నారంటూ తెగ ఎంక్వైరీ చేస్తున్నారట. వారెవరనేది రాబోయే రోజుల్లో బయటపడుతుందో లేదో చూడాలి.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here