Gossip Garage : ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు? గవర్నమెంట్ వర్సెస్ గ్లామర్ ఫీల్డ్..
ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.

Gossip Garage : పుష్ప సినిమాను మించిన ట్విస్ట్‌లు. ప్రతి మూమెంట్లో సెన్షెషన్. ప్రతి ఎపిసోడ్లో ఎలివేషన్స్.. మధ్య మధ్యలో డైలాగ్ వార్.. మొత్తానికి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. తగ్గేదేలే అని అల్లు అర్జున్.. తగ్గాల్సిందేని రేవంత్ సర్కార్ దూకుడు పెంచుతున్నాయి. గ్లామర్ ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్‌గా మారిన ఈ వ్యవహారంలో ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు..?
టాలీవుడ్ పెద్దలు వ్యవహరించిన తీరుపై సర్కార్ సీరియస్..
హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకీ సీరియస్ అవుతోంది. ఓ మహిళ మృతికి, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చేరడానికి కారణమైన తొక్కిసలాట ఘటనను రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ పెద్దలు వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు రాగానే సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ వెంట ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు.
టాలీవుడ్ పై సీఎం రేవంత్ నిప్పులు..
కానీ ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత సీరియస్‌గా తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అవుతారని అల్లు అర్జున్ సహా టాలీవుడ్ పెద్దలెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూనే సీఎం మొత్తం టాలీవుడ్‌ని తప్పుపట్టారు. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ను పరామర్శించకుండా.. ఒక్కరోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. సమాజానికి మీరేం సందేశం ఇస్తున్నారని అసెంబ్లీ వేదికగా టాలీవుడ్‌ని నిలదీశారు.
బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేస్తారనే గాసిప్..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనపై ఫైర్ అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వైల్డ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే తనపై ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు అల్లు అర్జున్. రేవంత్ సర్కార్ వెంటనే రియాక్షన్ చూపించింది. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్‌కు పిలిచి పోలీసులు ప్రశ్నలు సంధించారు. విచారణ ఇంతటితో ఆయిపోలేదు.. మళ్లీ విచారణకు పిలిచే అవకాశముందనే పోలీసుల వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అవసరమైతే సంధ్య థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నారట. మరోవైపు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారనే గాసిప్ కూడా వినిపిస్తోంది.
మరోవైపు సంధ్య థియేటర్ ఎపిసోడ్లో ప్రతిపక్షాలన్నీ అల్లు అర్జున్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ మంత్రులు, నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు సంధ్యా థియేటర్ నుంచి పొలిటికల్ ఫైర్‌గా టర్న్ తీసుకుంది.
ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న జనాలు.. ఫైర్ ఎవరు.. ఫ్లవర్ ఎవరు అని చర్చించుకుంటున్నారు. ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.
Also Read : మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా..? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం..