రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రుణమాఫీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఇక రుణమాఫీ మార్గదర్శకాలు పకడ్బందీగా ఉండనున్నాయి. పెద్దలకు కత్తెర వేయనున్నారు.

రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రుణమాఫీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Crop Loan Waiver : రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఏకకాలంలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇక రుణమాఫీ మార్గదర్శకాలు పకడ్బందీగా ఉండనున్నాయి. పెద్దలకు కత్తెర వేయనున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ప్రభుత్వ ఉద్యోగులు రుణమాఫీకి అనర్హులు. అంతేకాదు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆదాయపన్ను చెల్లిస్తున్న వారికి రుణమాఫీ చేయొద్దని ప్రభుత్వం యోచిస్తోంది.

కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణమాఫీని కూడా ఏకకాలంలో చేయనున్నారు.

Also Read : ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీ పంట రుణాల మాఫీ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో పాటు మ్యానిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో రుణమాఫీ కూడా ఒక ప్రధానమైన గ్యారెంటీ. ఇందులో అత్యంత కీలకమైన మార్గదర్శకాలు ఉండబోతున్నాయి. చాలా పకడ్బందీగా మార్గదర్శకాలు నిర్దేశించినట్లు సమాచారం. ఇప్పటివరకు అయితే కటాఫ్ డేట్ ను 2023 డిసెంబర్ 9గా నిర్ణయించింది ప్రభుత్వం. ఆ లోపు రైతులు తీసుకున్న రుణాలను (2లక్షల వరకు) మాఫీ చేయనుంది సర్కార్.