Telangana: బీజేపీలో కీలక పరిణామాలు.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై విజయ రామారావు సంచలన వ్యాఖ్యలు.. ఢిల్లీకి కె.లక్ష్మణ్

బండి సంజయ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి నుంచి తీసేయడం సరికాదని, అధ్యక్షుడి మార్పు అంటే ఆత్మహత్య సదృశ్యమేనని పేర్కొన్నారు.

Telangana: బీజేపీలో కీలక పరిణామాలు.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై విజయ రామారావు సంచలన వ్యాఖ్యలు.. ఢిల్లీకి కె.లక్ష్మణ్

K Laxman, Bandi Sanjay, Gunde VijayaRama Rao

Updated On : June 30, 2023 / 8:05 PM IST

Telangana – BJP: బీజేపీ తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సొంత పార్టీ నేతలే బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం కలకలం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, బీజేపీ నేత విజయ రామారావు (Gunde VijayaRama Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ (Bandi Sanjay) ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి నుంచి తీసేయడం సరికాదని, అధ్యక్షుడి మార్పు అంటే ఆత్మహత్య సదృశ్యమేనని పేర్కొన్నారు. అదే జరిగితే తెలంగాణ బీజేపీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక బీజేపీలో చేరికలు ఉండవని, అంతేగాక, బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు చూసే వారు పెరుగుతారని ట్వీట్ చేశారు.

ఢిల్లీకి కె.లక్ష్మణ్.. అందుకేనా?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు జరగబోయే కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా లక్ష్మణ్ ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో లక్ష్మణ్ కు ఢిల్లీకి వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ బెర్త్ కోసమా? లేదంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై చర్చించేందుకా అన్న ఆసక్తి నెలకొంది.

Mandula Samuel: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కీలక నేత రాజీనామా.. ఎందుకంటే?