Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్.. పోలీస్ స్టేషన్‌లో వీడియోలను షేర్ చేసిన మాజీమంత్రి
పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని బలవంతంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

BRS MLA Haish Rao
Harish Rao Arrest: తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు బుధవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ సీఐపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. గురువారం ఆయన్ను అరెస్టు చేసేందుకు కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు హరీశ్ రావును అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వాహనాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని బలవంతంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తనను అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో, పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన సమయంలో వీడియోలను హరీశ్ రావు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా? అంటూ ప్రశ్నించారు.
హరీశ్ రావు ట్వీట్ లో పేర్కొన్న ప్రకారం.. ‘‘రాష్ట్రంలో సాగుతుంది ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది’’ అంటూ హరీశ్ రావు హెచ్చరికలు చేశారు.
ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా?
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.
ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY
— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024