Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌కి దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేస్తుంది: హరీశ్ రావు

త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. తెలంగాణలో తమ పార్టీనే..

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌కి దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేస్తుంది: హరీశ్ రావు

Harish Rao

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్‌కి దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చేస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించే ఏరియా హాస్పిటల్ నూతన భవనానికి మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. తెలంగాణలో తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇస్తుందని అన్నారు.

ఆ పార్టీకి 30 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వద్దు అని వదిలేసిన నేతలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోందని విమర్శించారు. విద్యుత్తు రావడం లేదని కామెంట్స్ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి కరెంటు ప్లగ్ లో వేలు పెట్టి చూడాలని ఎద్దేవా చేశారు.

కాగా, తెలంగాణ ఎన్నికలకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది.

Also Read : రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం : మంత్రి కేటీఆర్