తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి, బీజేపీపై ప్రజల్లో నమ్మకం పోయింది – హరీష్
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి ? గత ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని అయినా చేశారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.

Election
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి ? గత ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని అయినా చేశారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీష్ రావుతో 10tv ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రభుత్వం చేస్తున్న పనులను ఆయన వివరించారు. బీజేపీ కేంద్రస్థాయి, కాంగ్రెస్ జాతీయస్థాయిల నేతలను తీసుకొస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఏమి తీసుకోలేదన్నారు. అధ్యక్షులు ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా..తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, గెలుపు ఓటములు సహజమే..కానీ..నేతలు మితిమీరిన విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
భావోద్వేగాల మధ్య, గ్లోబల్స్ ప్రచారం చేయడం ద్వారా బీజేపీ నేతలు లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసిన మంచి పని ఒక్కటి చెబుతారా ? అని సూటిగా ప్రశ్నించారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం, పవర్ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి వేయి కోట్లు నష్టం చేశారు..రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని ఇలా..ఎన్నో చెప్పారని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతు అని బీజేపీ నేతలు చెబుతున్నారు..కానీ..ప్రశ్నించాల్సింది కేంద్రానిదన్నారు.
బీజేపీ యొక్క నిజస్వరూపం బయటపడిందని, వంద రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలను గుర్తు చేశారాయన. రైతులకు మద్దతు పలుకుతున్న వారిపై ఐటీ రైడ్స్ చేయడం ప్రజలు గమనిస్తున్నారని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇంకా ఎలాంటి అంశాలపై ఏమి మాట్లాడారో వీడియో చూడండి.