Omicron In Telangana : ఒమిక్రాన్‌‌తో ప్రాణభయం లేదు.. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోండి: మంత్రి హరీష్

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ

Omicron In Telangana : ఒమిక్రాన్‌‌తో ప్రాణభయం లేదు.. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోండి: మంత్రి హరీష్

Harish Rao On Omicron Variant

Updated On : December 15, 2021 / 4:10 PM IST

Omicron In Telangana :  రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.  ఈరోజు ఆయన సిధ్ధిపేటలో రూ.15 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికి దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు విడిచి పెట్టాలని…ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవచ్చని వైద్యులే చెబుతున్నారని ప్రజలకు అవగాహన కల్పించారు.
Also Read : APSRTC Bus Accident : బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన పేర్నినాని
మీరు కోరితే మీ ఇంటింటికీ వచ్చి కోవిడ్ టీకాలు వేయిస్తామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.  ప్రజా ప్రయోజనార్థం, ప్రజల మనస్సులో ఉన్నది నెరవేర్చడమే మా ప్రయత్నం అనిమంత్రి పేర్కొన్నారు.