Yadagirigutta : యాదాద్రికి పోటెత్తిన భ‌క్తులు.. స్వామివారి ద‌ర్శ‌నానికి మూడు గంట‌లు..

తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు.

Yadagirigutta : యాదాద్రికి పోటెత్తిన భ‌క్తులు.. స్వామివారి ద‌ర్శ‌నానికి మూడు గంట‌లు..

Heavy Devotees in Yadadri Laxminarasimha Swamy Temple on May 12th

Updated On : May 12, 2024 / 11:19 AM IST

తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాద‌గిరిగుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం కావ‌డంతో ఆల‌యంలో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొంది. ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భక్తులే క‌నిపిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు.

తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌తో యాదాద్రి ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా లైన్ల‌లో వేచి ఉన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంట‌ల స‌మ‌యం ప‌డుతోండ‌గా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంట‌ల సమయం ప‌డుతోంది. ల‌డ్డు ప్ర‌సాదం కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట వ‌ద్ద కూడా భ‌క్తుల కోలాహ‌లం నెల‌కొంది.

తెలంగాణలో పోలింగ్‌కు సర్వంసిద్ధం.. అత్యధిక అభ్యర్థులు బరిలోఉన్న నియోజకవర్గం ఏదో తెలుసా?

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఆల‌య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.