Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు

కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో 3రోజులు భారీ వర్షాలు

Heavy Rain Alert

Updated On : June 16, 2021 / 11:09 PM IST

Heavy Rain Alert : కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుందని, దీంతో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 7 నుంచి 13 మిమి నమోదైంది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది.