TS Rains: మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరిక జారీ
గురువారం (02-09-21) రాత్రి తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమవగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telangana Rains
TS Rains: గురువారం (02-09-21) రాత్రి తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలు వరద నీటితో జలమయమవగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ చేసింది. శుక్రవారం పలు ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. శనివారం నుండి మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో శుక్రవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉండగా.. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.
కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.