Telangana Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్ బీ కేర్ ఫుల్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం నుండి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురియనున్నట్లు హెచ్చరించారు.

Telangana Rains
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం నుండి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురియనున్నట్లు హెచ్చరించారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావం చూపే ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవగా.. బుధవారం రాత్రి నుండి మరోసారి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదవగా హైదరాబాద్ నగరంలోని ఆసిఫాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.